నీతా అంబానీ డైమండ్ నెక్లస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | Nita Ambani | Boldbalu TV

9 Просмотры
Издатель
#anantambani #mukheshambani #boldbalutv

Pls Subscribe Boldbalu TV

అంబానీ భార్య నీతా అంబానీ డైమండ్‌ నగలు, పాకిస్తాన్‌ జీడీపీపై ఇంటర్నెట్‌లో సెటైర్లు, తీవ్ర చర్చ

రిలయన్స్‌ అధినేత బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఇంటర్నెట్‌లో పెద్ద సంచలనంగా మారాయి.

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.

అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్‌ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు.
దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్‌ నగలు, కాబోయే వరుడు అనంత్‌ అంబానీ డైమండ్‌ వాచ్‌ గురించి ఇంటర్నెట్‌ తీవ్ర చర్చ నడిచింది.

ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్‌ నెక్లెస్‌ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాలో పలు పోస్ట్‌లు వైరల్‌గా, తాజాగా ఏఎన్‌ఐ షేర్‌ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకులు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ వేడుకల్లో కళ్లు చెదిరే రేంజ్‌లో లగ్జరీయస్‌గా జరిగింది.


ఆ వేడుకలు యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతీది ఓ సెన్సెషన్‌ అయ్యింది. ఆ వేడుకుల్లో నీతా అంబానీ తనయ ఇషా అంబానీ ధరించి వస్త్రాలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్‌లోనే ఉంటాయి కానీ అంతకు మించి 'వేరేలెవెల్‌' అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఆమె లెహంగాపై ధరించిన బ్లౌజ్‌కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా. అందులో ఆమె ధరించిన బ్లౌజ్‌ ప్రతి ఒక్కరిని స్టన్‌ అయిపోయేలా చేసింది. ఆ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే జూకాలతో డిజైన్‌ చేశారు. కేవలం బంగారుపు జూకాలు కాదండోయ్‌. బంగారంతో పొదగబడిన వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో డిజైన్‌ చేశారు. ఈ బ్లౌజ్‌ని డిజైన్‌ చేసింది ప్రముఖ డిజైనర్‌ అబూ జానీ సందీప్‌ ఖోస్లా. ఆ బ్లౌజ్‌లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది.

ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అనంత్ అంబానీ వాచ్ అందరినీ ఆకర్షించింది. కాగా, దీని గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే దీని విలువ చూస్తే.. దాని ఖరీదు అక్షరాల రూ.63 కోట్లు. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో దీని ధర ఇంతనా అంటూ అవాక్కు అవుతున్నారు.

అయితే అనంత్ అంబానీ ధరించిన వాచ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన 10 మోడల్స్ గడియారాలలో ఒకటైన 'రిచర్డ్ మిల్లే RM 56-02' బ్రాండ్. దీనిని బేస్ ప్లేట్ గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేస్తారు. 0.35 మిమీ మందం కలిగిన టైటానియం సింగిల్ చట్రంతోపాటు.. సెరమిక్స్ కేబుల్ ఉపయోగించి కేస్ లోపల సస్పెండ్ చేయబడింది. RM 56-02 గురుత్వాకర్షణ ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా సమయపాలన ఖచ్చితత్వాన్ని పెంపొందించే టూర్ బిల్లన్ ఎస్కేప్‌మెంట్‌ను కలిగి ఉంది. ఈ ఖరీదైన వాచ్ $2.2 మిలియన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రూ. 18.2 కోట్ల నుంచి ప్రారంభమవుతుదంట.

@boldbalutv
Категория
Украшения
Комментариев нет.